గుంటూరులో దారుణం.. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల పంపిణీ!
- గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఘటన
- అధికారుల తీరుపై మండిపడ్డ ప్రజలు
- తమ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం
దీంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ..‘వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇలాంటి చర్యలతో మా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.