సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చింది సిద్ధరామయ్యే.. మా కుటుంబంపై కుతంత్రాలకు పాల్పడ్డారు: దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
- సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సిద్ధరామయ్య వర్గీయులే
- అంతా చేసి.. ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నారు
- ఆయన మనసులో ఇంత విషం ఉందనే విషయాన్ని గ్రహించలేకపోయాం
లోక్ సభ ఎన్నికల్లో మండ్యా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత గెలుపుకు సిద్ధరామయ్య సహకరించారని... తన మనవడు నిఖిల్ ఓటమిపాలయ్యేలా చేశారని దేవెగౌడ అన్నారు. రాజకీయ ద్వేషంతో తమ కుటుంబంపై కుతంత్రాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అంతకంతా అనుభవించక తప్పదని అన్నారు. ఆయన మనసులో ఇంత విషం ఉందనే విషయాన్ని తాము గ్రహించలేకపోయామని చెప్పారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆహ్వానించడం వల్లే తాము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.