'ట్రిపుల్ తలాఖ్' అంశంపై పరిశీలించేందుకు సుప్రీం సుముఖత
- దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ
- కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
- జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
ముమ్మారు తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పు ఇచ్చినా, అది కొనసాగుతుండడం అన్యాయమని భావించిన ఎన్డీయే ప్రభుత్వం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019లో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని న్యాయస్థానం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.