స్నేహితుడితో మాట్లాడేందుకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థిని.. ముగ్గురు యువకుల అత్యాచారం
- చిత్తూరు జిల్లాలో గత నెల 3న ఘటన
- బయటపెడితే చంపేస్తామని బెదిరించిన యువకులు
- అనారోగ్యానికి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు
తాజాగా, ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపుతామని తమను బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. అందుకనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపింది. తాజాగా, అనారోగ్యానికి గురికావడంతో తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నానని, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.