Narendra Modi: చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'!

  • 36.9 లక్షల ఇంప్రెషన్స్
  • 4.27 కోట్ల మంది వీక్షకులు
  • వెల్లడించిన బీఏఆర్సీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా, సాహసాల బేర్ గ్రిల్స్ రూపొందించిన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' స్పెషల్ ఎపిసోడ్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడించిన డిస్కవరీ చానెల్, 36.9 లక్షల ఇంప్రెషన్స్ నమోదయ్యాయని తెలిపింది. ఈ నెల 12న ఈ కార్యక్రమం డిస్కవరీలో ప్రసారం కాగా, ఇన్ఫోటెయిన్ మెంట్ (వినోదంతో కూడిన సమాచార ప్రోగ్రామ్) విభాగంలో అత్యధిక మంది వీక్షించిన ఘనతను సొంతం చేసుకుందని పేర్కొంది.

బీఏఆర్సీ (బ్రాడ్‌ కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) గణాంకాల ప్రకారం, ఈ కార్యక్రమం తొలిసారి ప్రసారమైన తరువాత, పునః ప్రసారం, దూరదర్శన్ లో ప్రసారం అయినప్పుడు మొత్తం 4.27 కోట్ల మంది వీక్షించారని తెలుస్తోంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించగా, ఎపిసోడ్ సూపర్ హిట్ కావడంతో తాము పులుల సంరక్షణకు కొంత నిధిని ఇవ్వనున్నామని డిస్కవరీ వెల్లడించింది.

More Telugu News