Congress: చిదంబరానికి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ!

  • ఈ  మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు
  • ఈ నెల 26 వరకూ సీబీఐ కస్టడీలో చిదంబరం
  • చిదంబరాన్ని ఆయన కుటుంబసభ్యులు, లాయర్లు కలవొచ్చన్న కోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కస్టడీ విధించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. చిదంబరానికి నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చిదంబరం ఈ నెల 26 వరకూ కస్టడీలో వుంటారు. చిదంబరం కుటుంబసభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు రోజూ ఆయనను అరగంట పాటు కలవవచ్చని కోర్టు పేర్కొంది. కాగా, చిదంబరంను ఐదు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకోవాలని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News