Chiranjeevi: సినీరంగంలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందిన చిరంజీవికి శుభాకాంక్షలు: చంద్రబాబు

  • చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ట్వీట్
  • చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్న చంద్రబాబు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవిని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించారని, అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలసి సంతోషంగా గడిపిన ఒక ఫొటోను షేర్ చేశారు. మరోవైపు, తమ అభిమాన నటుడికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలపడం పట్ట మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi
Chandrababu
Birthday Wishes
Telugudesam
Tollywood

More Telugu News