Kurnool District: భార్యతో తగాదా పడి క్షణికావేశంలో నాలుక కోసుకున్న యువకుడు

  • రాత్రంగా గొడవ పడడంతో ఆగ్రహం
  • నోటి నుంచి రక్తం వస్తుండడంతో గమనించిన తల్లి
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
క్షణి కావేశంలో నిర్ణయాలు ఎలా ఉంటాయనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. భార్యతో గొడవపడిన ఓ యువకుడు ఆక్రోశం తట్టుకోలేక తన నాలుక కోసుకున్నాడు. కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన చిగుర్ల చంద్రయ్య, లింగమ్మ దంపతులు. దంపతుల మధ్య విభేదాలున్నాయి.

ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడ్డాడు. భార్యపట్ల ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆవేశాన్ని అణచుకోలేక నిన్న ఉదయం కత్తితో తన నాలుకను తానే కోసుకున్నాడు. నోటి నుంచి రక్తం కారుతుండడం గమనించిన తల్లి విషయం ఏమిటని ఆరాతీయగా కోసిన నాలుక భాగాన్ని ఆమె చేతిలో పెట్టడంతో షాకయ్యింది. వెంటనే కొడుకుని అచ్చంపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి, తర్వాత మహబూబ్‌నగర్‌ కు తరలించింది. అయితే అప్పటికే ఆలస్యం అయినందున నాలుకను తిరిగి అతికించే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు.
Kurnool District
amrabad
man toungue

More Telugu News