Vizag: ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

  • విశాఖ-విజయవాడ మధ్య పరుగులు తీయనున్న డబుల్ డెక్కర్
  • విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విజయవాడ చేరిక 
  • ప్రారంభించనున్న రైల్వే శాఖ సహాయమంత్రి 
విశాఖ-విజయవాడ నగరాల మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది.
ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి దీనిని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు ఈ రైలు చేరుతుందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ ఆధ్వర్యంలో వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలంటూ మహాధర్నా నిర్వహించారు. ఈ డివిజన్ కొనసాగింపునకు అవసరమైతే మరిన్ని పోరాటాలు చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
Vizag
Vijayawada
Uday Express
Double deckker

More Telugu News