Madhya Pradesh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ కన్నుమూత

  • రక్తపోటు పడిపోవడంతో ఆసుపత్రిలో చేరిక
  • గతేడాది రాజకీయాల నుంచి తప్పుకున్న నేత
  • 15 నెలలపాటు ముఖ్యమంత్రిగా సేవలు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఈ ఉదయం భోపాల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో ఈ నెల 7న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత వెంటిలేటర్‌పై ఉంచారు. తాజాగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.

ఆగస్టు 2004 నుంచి నవంబరు 2005 వరకు గౌర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 జూన్ 1930న జన్మించిన బాబులాల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విస్తరణకు శ్రమించి విజయం సాధించారు. వయసు మీద పడడంతో గతేడాది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

More Telugu News