Kodandaram: నల్లమల అడవుల్లో తిరిగి వస్తాను... డీజీపీని అనుమతి కోరిన కోదండరామ్

  • నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలు
  • కొన్ని మండలాల్లో పర్యటించేందుకు అనుమతించండి
  • పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపణ
యురేనియం ఖనిజాన్ని వెలికితీయాలని భావిస్తున్న నల్లమల అడవుల పరిధిలోని మండలాల్లో తాను పర్యటించి వచ్చేందుకు అనుమతించాలని టీజేఎస్ (తెలంగాణ జన సమితి) అధ్యక్షుడు కోదండరామ్, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. పార్టీ అధికార ప్రతినిధితో కలిసి డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఆయన, తమకు రక్షణ కల్పించలేమని చెబుతూ పోలీసు అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపించారు.

 మావోయిస్టు అమరుల వారోత్సవాలు జరుగుతున్నాయని మొదట, ఆపై అడవి జంతువుల నుంచి కాపాడలేమంటూ మరోసారి తమను అడ్డుకున్నారని అన్నారు. టీజేఎస్ ప్రతినిధులను అడ్డుకుని సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద అదుపులోకి తీసుకున్నారని అన్నారు. యురేనియం ఖనిజాన్ని గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో తాను పర్యటించి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నానని, అందుకు అనుమతించాలని కోదండరామ్ కోరారు.
Kodandaram
Nallamala
Urenium
DGP

More Telugu News