america: అమెరికాలో ఈతకు వెళ్లి, విశాఖ విద్యార్థి మృతి

  • పోర్టుల్యాండ్‌లో ఎంఎస్ చదువుతున్న సుమీద్
  • స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మృతి
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. నగరంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఎంఎస్ కుమార్ స్టీల్‌ప్లాంట్ క్రీడల శాఖ డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ఎం.సుమీద్ (27) అమెరికాలోని పోర్టుల్యాండ్‌లో రోబోటిక్స్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం క్రీటర్‌లాక్ నది వద్దకు వెళ్లిన సుమీద్ ఈత కొడుతూ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
america
Visakhapatnam District
sumeed
swimming

More Telugu News