భోజనంలో లడ్డూలే పెట్టి వేధిస్తున్న భార్య.. విడాకులు కోసం కోర్టుకెళ్లిన భర్త!
- ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఘటన
- తాంత్రికుడి సలహాతో భర్తకు లడ్డూలు పెడుతున్న భార్య
- కనీసం భోజనాన్ని కూడా తిననివ్వని వైనం
యూపీకి చెందిన ఈ బాధితుడికి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఈ జంటకు ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే వీరి కాపురంలో ఓ తాంత్రికుడు చిచ్చు పెట్టాడు. ఇటీవల భర్త అనారోగ్యానికి గురికాగా, భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. దీంతో అతను..‘నీ భర్త ఆరోగ్యం బాగుపడాలంటే అతనికి ఉదయం 4, సాయంత్రం 4 లడ్డూలు తినిపించు’ అని సలహా ఇచ్చాడు.
దీంతో తన భార్య భోజనాన్ని ముట్టుకోనివ్వడం లేదనీ, లడ్డూలతో చంపేస్తుందని బాధితుడు కోర్టు ముందు వాపోయాడు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీస్ అధికారులు ఈ జంటకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒకవేళ కౌన్సెలింగ్ ముగిశాక కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోతే విడాకులు మంజూరు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.