Telangana: తాగొచ్చి వేధిస్తున్నాడని.. తల్లిదండ్రులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

  • పెద్దపల్లి జిల్లా చందపల్లిలో ఘటన
  • నిద్రిస్తున్న భార్యను కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసిన భార్య
  • పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు
తాగొచ్చి వేధిస్తున్న భర్తను తల్లిదండ్రులు, సోదరులతో కలిసి హతమార్చిందో భార్య. పెద్దపల్లి జిల్లా చందపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  ఎన్టీపీసీలోని ఎలుకపల్లిగేటు వద్ద నివాసం ఉండే సయ్యద్‌ ఖలీం-ఆస్రాబేగం భార్యాభర్తలు. 11 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసిన సయ్యద్ ఆ ఉద్యోగం మానేసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాగుడుకు అలవాటు పడిన ఖలీం రోజూ తాగొచ్చి భార్యను కొట్టడాన్ని అలవాటుగా చేసుకున్నాడు.

అతడి బాధలు భరించలేని ఆస్రా బేగం ఏడాదిన్నర క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ ఖలీం వేధింపులు ఆగలేదు. అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వేధించేవాడు. ఆదివారం కూడా ఇలాగే చేశాడు. దీంతో విసిగిపోయిన ఆస్రాబేగం అతడు నిద్రిస్తున్న వేళ తల్లిదండ్రులు, సోదరులతో కలిసి బండరాళ్లతో దాడిచేసి హత్య చేసింది. అనంతరం అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, వీరు ఉండే ఇల్లు గ్రామానికి చివరన ఉండడంతో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Telangana
Peddapalli District
murder

More Telugu News