Chittore: బంతి పూల రైతు కన్నీరు... వారం క్రితం కిలో రూ. 100, ఇప్పుడు రూ.5!

  • హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ. 5 మాత్రమే
  • కోయకుండా వదిలేస్తున్న రైతులు
  • వినాయక చవితి వరకూ పరిస్థితి ఇంతే!
శ్రావణమాసంలో బంతిపూల రైతుల కంట కన్నీరే మిగిలింది. మూడవ శుక్రవారం వరకూ రైతులకు మంచి ధర లభించగా, ఆపై అమాంతం పడిపోయింది. హోల్ సేల్ మార్కెట్లో కిలోకు రూ. 30, బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 100 వరకూ పలికిన బంతిపూల ధర, ఇప్పుడు కిలోకు రూ. 5కు పడిపోయింది. ఇది చిత్తూరు జిల్లాలో బంతిపూలను నమ్ముకున్న రైతు పరిస్థితి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంవత్సరమంతా బంతిని పండిస్తారు. ధర పడిపోవడంతో, పూలను కోయకుండా తోటలోనే వదిలేస్తున్నారు. కొంతమంది కోసి, మార్కెట్ కు తీసుకు వచ్చినా, కనీస ట్రాన్స్ పోర్ట్ ధర లభించక, అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. వినాయక చవితి వచ్చి, మండపాలు కొలువుదీరేంత వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.
Chittore
Banti Poolu
Farmers
Sravanamasam
Rate
Price

More Telugu News