Kurnool District: శ్రీశైలం ఆలయాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

  • శ్రీశైలంలో షాపులను ఓ వర్గం వారికే కేటాయించారు
  • ఇది కరెక్టు కాదు
  • రేపు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన

శ్రీశైలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలు సవ్యంగా జరగలేదని, అన్యమతస్థులకు కేటాయించారన్న ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీశైలం ఆలయాన్ని పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. రేపు శ్రీశైలంలో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శ్రీశైలంలో షాపులను ఓ వర్గం వారికే కేటాయించారని, ఇది కరెక్టు కాదని అన్నారు.

ఈ ఆరోపణలపై శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి స్పందిస్తూ, శ్రీశైలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే జరిగాయని, డీడీలు పరిశీలించి అన్యమతస్తుల దరఖాస్తులను అనుమతించలేదని స్పష్టం చేశారు.

శ్రీశైలంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు వీలు లేదని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలిపితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News