Rajasekhar: ఎమోషనల్ థ్రిల్లర్ గా రాజశేఖర్ కొత్త చిత్రం

  • ఆశించిన స్థాయిలో ఆడని 'కల్కి'
  • రాజశేఖర్ నెక్స్ట్ ప్రాజెక్టుకి సన్నాహాలు 
  • వచ్చే మార్చిలో విడుదల చేసే ఆలోచన  
రాజశేఖర్ నుంచి ఇటీవల వచ్చిన 'కల్కి' ఆశించిన స్థాయిలో ఆయనకి విజయాన్ని అందించలేకపోయింది. దాంతో ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక ఎమోషనల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది తాజా సమాచారం. 'బేతాళుడు' సినిమాకి దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఇటీవల ఒక కథను వినిపించగా, వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ఈ సినిమాను తమిళ నిర్మాత ధనుంజయన్ నిర్మించనున్నాడు. ధనుంజయన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించి షూటింగు మొదలుపెడతారట. ప్రస్తుతానికి సత్యరాజ్ .. నాజర్.. బ్రహ్మానందంను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టుల .. సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. 
Rajasekhar
Sathya Raj
Nassar

More Telugu News