బీజేపీలో చేరుతున్న కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి?

19-08-2019 Mon 12:07
  • జేపీ నడ్డాతో ఆదినారాయణరెడ్డి భేటీ
  • ఇప్పటికే ఓ బీజేపీ కీలక నేతతో సంప్రదింపులు
  • రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పార్టీ మారాలనుకుంటున్న టీడీపీ నేత

కడప జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆయన కలిశారు. ఇప్పటికే బీజేపీ కేంద్ర కమిటీలో ఉన్న ఓ కీలక నేతతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డిపై రాజకీయ పరమైన ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది. జగన్ ను కూడా ఆయన సవాల్ చేస్తూ వచ్చారు.

ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో, ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ ఒత్తిడిని అధిగమించేందుకు బీజేపీలో చేరడమొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు సమాచారం.