తమిళనాడులో దుర్ఘటన: ఆటో టైరు పేలి 80 అడుగుల లోతులో పడిన వాహనం.. 8 మంది మృతి

19-08-2019 Mon 07:25
  • తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘటన
  • మరో 9 మందికి తీవ్ర గాయాలు
  • 80 అడుగుల లోతు నుంచి బాధితులను బయటకు తీసిన పోలీసులు

వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపుతప్పి 80 అడుగుల లోతున్న బావిలో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరుచ్చి-తిరువాయూర్ రోడ్డుపై నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బావి లోతుగా ఉండడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టైరు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.