హైదరాబాద్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన వైసీపీ యూత్ లీడర్!

  • జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • మోతాదుకు మించి మద్యం తాగిన ఆంజనేయులు
  • వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని, జూబ్లీహిల్స్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దొరికిపోయారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఆ పార్టీ యువజన విభాగం నేత ఆంజనేయులు మద్యం తాగి వాహనం నడుపుతూ అదే దారిలో వచ్చారు. పోలీసులు ఆపి తనిఖీ చేయగా, మోతాదుకు మించి మద్యం తాగినట్టు తేలింది. దీంతో అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు పెట్టారు. గత రాత్రి జరిపిన తనిఖీల్లో మొత్తం 24 మంది పట్టుబడినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 19 బైకులు, 4 కార్లు, ఒక ఆటోను సీజ్‌ చేశామని, పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Police
Drunk Driving
YSRCP

More Telugu News