శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి నూతన పూజారి

18-08-2019 Sun 07:52
  • డ్రా ద్వారా ఎంపిక చేసినట్టు ప్రకటించిన ట్రావెన్‌కోర్ బోర్డు
  • డ్రా తీసిన పందళ రాజ వంశ బాలుడు మాధవ్
  • ఏడాది పాటు కొనసాగనున్న కొత్త పూజారులు

శబరిమల అయ్యప్ప ఆలయానికి కొత్త పూజారి వచ్చేశారు. మలప్పురం జిల్లా తిరునవాయకు చెందిన ఏకే సుధీర్ నంబూద్రిని ఆలయ నూతన పూజారిగా నియమించారు. అలాగే, ఎంఎస్ పరమేశ్వర్‌ను మలికాప్పురం దేవీ ఆలయానికి ప్రధాన పూజరిగా నియమించారు. ఈ ఏడాది నవంబరు 17 నుంచి ఏడాది వరకు ఆలయ పూజారులుగా వ్యవహరించనున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

పందళ రాజవంశానికి చెందిన బాలుడు మాధవ్ కె.వర్మ ఆలయ సోపానంలో డ్రా నిర్వహించి వీరిని కొత్త పూజారులను చేశారు. నూతన పూజారులు నవంబరు 16న సాయంత్రం నుంచి మొదలయ్యే 41 రోజుల మండల దీక్ష నుంచి ప్రధాన పూజారులుగా కొనసాగనున్నారు.