thar express rail: థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన భారత్

  • ఈ నెల 9న తమవైపు థార్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన పాక్
  • తాజాగా భారత్ కూడా ప్రకటన
  • ఎప్పుడు పునరుద్ధరించేదీ తర్వాత చెబుతామన్న అధికారులు
కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్‌తో పాక్ దాదాపు అన్ని సంబంధాలను తెంచుకుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా  జోథ్‌పూర్‌-కరాచీ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించింది. శుక్రవారం బయలుదేరాల్సిన ఈ రైలు వెళ్లలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైలును ఎప్పుడు పునరుద్ధరించేదీ మళ్లీ చెబుతామన్నారు.

జోధ్‌పూర్‌లోని భగత్ కీ కోఠి రైల్వే స్టేషన్ నుంచి సరిహద్దునున్న మునాబావ్ వరకు థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. అక్కడి నుంచి ప్రయాణికులు పాక్ వైపు నుంచి వచ్చే లింక్ ఎక్స్‌ప్రెస్‌లో కరాచీ చేరుకుంటారు. అయితే, ఈ నెల 9న తమ వైపు నుంచి నడిచే థార్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా థార్ ఎక్స్‌ప్రెస్ సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. 
thar express rail
India
Pakistan
karachi

More Telugu News