East Godavari District: అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్‌లైన్ లీక్.. భయంతో వణుకుతున్న స్థానికులు

  • పరిపాటిగా మారుతున్న లీకేజీ
  • భారీగా ఎగసిపడిన సహజవాయువు
  • ఘటనా స్థలం వద్ద బైఠాయించిన స్థానికులు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గత అర్ధరాత్రి ఓఎన్‌జీసీ పైపులైను లీకైంది. లీకైన ప్రాంతం నుంచి సహజ వాయువు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి రావడానికి ముందే స్థానిక యువత లీకేజీని కొంతవరకు నియంత్రించ గలిగింది.

గ్యాస్ పైప్‌లైన్ లీక్ ఇక్కడ పరిపాటి కావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా శాశ్వతంగా పరిష్కరించాలంటూ ఘటనా స్థలంలో యువకులు బైఠాయించారు.
East Godavari District
antarvedi
ongc pipe line

More Telugu News