Vijayawada: విజయవాడలో భార్య తలనరికిన కేసు.. ఆమె భర్త, కారు డ్రైవర్ అరెస్టు

  • ఈ నెల 11న సత్యనారాయణపురంలో జరిగిన ఘటన
  • కొబ్బరిబొండాల కత్తితో ఆమె తల నరికాడు
  • ఆమె భర్త ప్రదీప్ కుమార్, కారు డ్రైవర్ భవానీ ప్రసాద్ అరెస్టు
విజయవాడలో భార్య తలనరికిన ఘటనలో ఆమె భర్తను, కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్త ప్రదీప్ కుమార్, కారు డ్రైవర్ భవానీప్రసాద్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న స్థానిక సత్యనారాయణపురంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను డీసీపీ విజయరావు వివరించారు. ప్రదీప్ తన భార్య మణిక్రాంతి తలను కొబ్బరిబొండాల కత్తి ఉపయోగించి నరికినట్టు చెప్పారు. కాగా, నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని, నరికిన తలను బుడమేరు వాగులో పడేశాడు.
Vijayawada
murder
Dcp
Vijayarao

More Telugu News