krishna: వరద నీటిలో రాజధాని నిర్మాణాలను ముంచేయాలనేది వైసీపీ ప్రభుత్వం కుట్ర: టీడీపీ నేత చినరాజప్ప

  • చంద్రబాబుకు హాని చేయాలని చూస్తున్నారు
  • రివర్స్ టెండరింగ్ వద్దని అథారిటీ చెప్పినా పట్టించుకోరే
  • జగన్ పాలనపై ప్రతిఒక్కరూ మండిపడుతున్నారు
కృష్ణా వరద నీటిలో రాజధాని నిర్మాణాలను ముంచేయాలనేది వైసీపీ ప్రభుత్వ కుట్ర అని టీడీపీ నేత చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు హాని చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ వద్దని ప్రాజెక్టు అథారిటీ చెప్పినా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్లతో దృశ్యాలు తీయడం సరికాదని అన్నారు. జగన్ పాలనపై ప్రతిఒక్కరూ మండిపడుతున్నారని, గ్రామవాలంటీర్ పోస్టులు నూటికి నూరుశాతం వైసీపీ వాళ్లకే ఇచ్చారని ఆరోపించారు.

చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్ర  

విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడుతూ, కృష్ణా నది ఉపనదులు, వాగులు ఏవీ పొంగలేదని, అయినా ఇంత వరద ఒకేసారి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 
krishna
river
Chandrababu
Telugudesam
chinarajappa

More Telugu News