Rangasthalam: 'సైమా' అవార్డులలో దుమ్మురేపిన 'రంగస్థలం'... అవార్డుల వివరాలు!

  • దుబాయ్ లో వైభవంగా కార్యక్రమం
  • ఆహూతులను అలరించిన నటీనటులు
  • 'రంగస్థలం' చిత్రానికి 9 అవార్డులు

దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్ చరణ్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, సమంత, చంద్రబోస్ తదితరులకు అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ కు అవార్డులు లభించాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ ఆటపాటలతో ఆహూతులను అలరించారు. తెలుగు అవార్డుల ప్రదానం పూర్తికాగా, నేడు తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల ఫంక్షన్ జరుగనుంది.
 'సైమా' అవార్డులు (తెలుగు) ఎవరెవరికి లభించాయంటే...

ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు: విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి: సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి: అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి ( పిల్ల రా - ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని: ఎంఎం మానసి (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు: కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి: పాయల్‌ రాజ్‌ పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకుడు: రామకృష్ణ (రం‍గస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాప్యులర్ స్టార్: విజయ్‌ దేవరకొండ

More Telugu News