KCR: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని మురిసిపోయిన సీఎం కేసీఆర్

  • నేడు రాఖీ పండుగ
  • రాఖీ పండుగ సంప్రదాయాలు పాటించిన కేసీఆర్  
  • ప్రగతిభవన్ లో తోబుట్టువులతో వేడుక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాఖీ పండుగ సందర్భంగా తన అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు. తన అధికారిక నివాసం ప్రగతిభవన్ కు తోబుట్టువులు తరలిరాగా, కేసీఆర్ సంప్రయదాయబద్ధంగా రాఖీలు కట్టించుకుని, వారికి కానుకలు ఇచ్చి సంతోషపెట్టారు. 65 ఏళ్ల కేసీఆర్ కు తొమ్మిదిమంది అక్కాచెల్లెళ్లు కాగా, వారిలో కొందరు వృద్ధాప్యంతో కన్నుమూశారు. కేసీఆర్ కు ఓ సోదరుడు కూడా ఉన్నారు.
KCR
Rakhi
Telangana

More Telugu News