Vijayasanthi: తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల కాలం నడుస్తోంది: విజయశాంతి

  • కేసీఆర్ పై రాములమ్మ వ్యాఖ్యలు
  • తన మంత్రులతో కేసీఆర్ కొత్త సిద్ధాంతం చెప్పిస్తున్నారంటూ విమర్శ
  • తెలంగాణవాదులు, ఉద్యమకారులకు కాలం చెల్లిందంటూ ఆవేదన
కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణవాదులకు కాలం చెల్లిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల సమయం నడుస్తోందని విమర్శించారు. తన మంత్రుల ద్వారా కేసీఆర్ చెప్పిస్తున్న కొత్త సిద్ధాంతం ఇదేనని విజయశాంతి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినవారికే మేలు జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పాటుపడిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Vijayasanthi
Telangana
KCR

More Telugu News