నీడలా వెంటాడిన ఫేస్‌బుక్ పోస్టింగ్... రెండేళ్ల తర్వాత కేసు నమోదు!
- బీఫ్ తింటున్న ఫొటో అప్‌లోడ్ చేసిన రీసెర్చి స్కాలర్
- ఇప్పుడు పత్రికల్లో రావడంతో పోలీసులు ఆరా
- నన్ను ఇబ్బంది పెట్టేందుకే కేసు అంటున్న బాధితురాలు
బీఫ్ తింటున్న ఈ ఫొటోను ఆమె అప్పట్లో అప్‌లోడ్ చేసింది. ఆ ఫొటో ఇటీవల స్థానిక పత్రికల్లో రావడంతో పోలీసులు సుమోటోగా తీసుకుని ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ‘ఆ ఫొటో నేను పెట్టిందే. అప్పట్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా పేలవంగా ఆడింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక ఆ ఫొటో పోస్టు చేశాను. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాను. మరి ఇప్పుడు స్థానిక పత్రికల్లో ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ బాధితురాలు వాపోతోంది.
తాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందున కుట్రపూరితంగా ఎవరో ఈ పనిచేసినట్లు అనుమానిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. కాగా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను అవమానించేలా పోస్టు పెట్టిన ఓ యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.