Pawan Kalyan: మీ బాబాయి హత్య కేసును ఏం చేశారు?: జగన్ కు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

  • చిన్న విషయానికి ఏడు కేసులు పెడతారా?
  • మీకు టీడీపీ భయపడుతుందేమో కానీ మేం భయపడం 
  • విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్

తమ ఎమ్మెల్యే విషయంలో చాలా చిన్న విషయానికి ఏడు కేసులు పెట్టిన వైఎస్ జగన్ సర్కారు, వైఎస్ వివేకా హత్య కేసును ఏం చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసును ఏం చేశారని ప్రశ్నించిన ఆయన, అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వ్యక్తి విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే ఓ జర్నలిస్టును కొట్టి కారులో వేసుకుని వెళ్లేందుకు ప్రయత్నించినా, ఆయన్ను వదిలేశారని విమర్శలు గుప్పించారు.

తాజాగా, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్, తమ ఎమ్మెల్యే ఓ డయాలసిస్‌ రోగిని వదిలేయమని అడిగేందుకు వెళ్లడమే తప్పయిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు తెలుగుదేశం పార్టీ భయపడుతుందేమోగానీ జనసేన భయపడదని హెచ్చరించారు. తమ హక్కులను కాలరాయాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని హెచ్చరించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 2015లో జనసేన ఫ్లెక్సీలు కడుతూ, కరెంట్ షాక్ కు గురై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పవన్, నాగబాబు చెరో రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

More Telugu News