Andhra Pradesh: ‘జగమొండి’లో సగం ఆయన పేరులో, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉంది: చంద్రబాబునాయుడు

  • పీపీఏలపై పున:సమీక్ష మంచిది కాదని ఇంధన శాఖ చెప్పింది
  • ఇప్పుడు, జపాన్ రాయబార కార్యాలయమూ భారత్ కు ఓ లేఖ రాసింది
  • ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో!

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సమీక్షించాలన్న నిర్ణయంపై పలు విమర్శలు తలెత్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు స్పందించారు. ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

విద్యుత్ ఒప్పందాల(పీపీఏ)పై పున:సమీక్ష మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ చెప్పిందని, ఏపీకి పెట్టుబడులు దూరమవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదని విమర్శించారు. ఇప్పుడు.. జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు ఓ లేఖ రాసిందని అన్నారు.

జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉందంటూ జగన్ పై విమర్శలు చేశారు. రాష్ట్రం దాటి, దేశం దాటి, జగమంతా వారికి హితవాక్యాలు చెబుతుంటే, బహుశా ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో! పిచ్చికి అనేక రూపాలు మరి అంటూ విమర్శించారు.  

More Telugu News