చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- చంద్రబాబుకు రాఖీ కట్టిన సీతక్క
- టీడీపీలో చేరినప్పటి నుంచి చంద్రబాబుకు రాఖీ కడుతున్న సీతక్క
- ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు
మరోవైపు, సీతక్కతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. వీరిద్దరూ చంద్రబాబుకు రాఖీ కడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుడిచేతి నరంపై ఒత్తిడి పెరగడంతో నొప్పితో చంద్రబాబు బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో, ఆయన విశ్రాంతి కోసం హైదరాబాదుకు వచ్చారు.