అనుష్కలాంటి హీరోయిన్ ను నేను చూడలేదు: దర్శకుడు వి.సముద్ర
- అనుష్కతో రెండు సినిమాలు చేశాను
- స్టార్ హీరోయిన్ అయినా ఆమె ఒదిగే వుంటుంది
- హీరోయిన్ అంటే అలా ఉండాలన్న సముద్ర
అనుష్క ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా .. నవ్వుతూ కనిపిస్తుంది. ఎవరో ఒకరిపై ఆమె చిరాకు పడటమనేది నేను చూడలేదు. తన తొలి సినిమా అప్పుడు ఎంత ఒదిగిపోయి కనిపించిందో, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత కూడా ఆమె అలాగే వుంది. నా కెరియర్లో నేను అలాంటి హిరోయిన్ ను చూడలేదు. తనని చూసిన తరువాత హీరోయిన్ అంటే అలా ఉండాలి అని సన్నిహితులతో అనేవాడిని. అంతేగాదు .. అంత వినయంగా ఉండటానికి నేను కూడా ప్రయత్నించేవాడిని" అని చెప్పుకొచ్చారు.