punjab: వివాహితకు యువకుడి ఫ్లయింగ్ కిస్సులు.. మూడేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!

  • పంజాబ్ లోని మొహాలీలో ఘటన
  • వివాహిత లక్ష్యంగా వికృత చేష్టలు
  • జైలుశిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించిన కోర్టు

దేశంలో ఆకతాయిలకు కొదవేం లేదు. బహిరంగ ప్రదేశాల్లో, ఇంటి చుట్టుపక్కల వీరు మహిళలను మాటలు, చేతలతో వేధింపులకు గురిచేస్తూ ఉంటారు. అయితే వీటిని కొందరు మహిళలు పట్టించుకోకుండా వదిలేస్తే, మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి ఘటనే పంజాబ్ లోని మొహాలీలో చోటుచేసుకుంది.

మొహాలీలో వినోద్ అనే యువకుడు ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి ఉంటోంది. అయితే సదరు మహిళపై కన్నేసిన వినోద్ కొన్నిరోజులుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమె కనిపించగానే ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, అసభ్యకరంగా భంగిమలు చూపడం వంటి పిచ్చి చేష్టలు చేసేవాడు. ఇది హద్దుదాటడంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పగా, అతను వినోద్ ను గట్టిగా హెచ్చరించాడు.

అయినా ప్రవర్తన మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు కోర్టుకు వెళ్లడంతో, వినోద్ సదరు వివాహితను వేధించినట్లు రుజువైంది. ఓ వివాహితను వేధించినందుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.3,000 జరినామాను కోర్టు విధించింది.

More Telugu News