భార్యతో కన్నడ స్టార్ హీరో దర్శన్ గొడవలు!
- గతంలో గొడవలు పడిన దర్శన్, విజయలక్ష్మి
- ఆపై సర్దుకున్నా మరోమారు విభేదాలు
- ట్విట్టర్ లో పరస్పరం అన్ ఫాలో
ఇప్పటికే ఇద్దరూ వేరువేరుగా నివాసం ఉంటుండగా, ఇటీవల విడుదలైన 'యజమాన' సినిమా మేకింగ్ వీడియోలో కలిసి కనిపించారు. దీంతో గొడవలు సద్దుమణిగాయని భావించేలోపే తాజా పరిణామాలు సంభవించాయి. ఇక తమ మధ్య గొడవలేమీ లేవని విజయలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చినా, ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ సీనియర్ నటుడు, మరో రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.