Sumitra: నా సినీరంగ ప్రవేశం అలా జరిగింది: సీనియర్ నటి సుమిత్ర

  • వైజాగ్ లో పుట్టిపెరిగాను 
  • సెలవులకి చెన్నైకి వెళ్లాను 
  • అప్పుడే మలయాళ మూవీ లో ఛాన్స్ వచ్చిందన్న సుమిత్ర    

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సుమిత్ర నటించారు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. " మా అమ్మానాన్నలు కేరళకి చెందిన వాళ్లు. నాన్న ఉద్యోగ రీత్యా వైజాగ్ కి వచ్చేయడం జరిగింది. అక్కడే నేను పుట్టిపెరిగాను.

నాకు 13 .. 14 ఏళ్ల వయసున్నప్పుడు చెన్నైలోని మా దూరపు బంధువుల ఇంటికి వెళ్లాము. కేఆర్ విజయ డాన్స్ మాస్టర్ మురుగప్పన్ తో ఆ సమయంలోనే మా నాన్నకి పరిచయం ఏర్పడింది. మురుగప్పన్ నన్ను చూసి .. 'అమ్మాయి చాలా అందంగా వుంది .. సినిమాల్లో ట్రై చేయండి' అని చెప్పాడు. నాన్నను ఒప్పించి నన్ను ఒక స్టూడియోకి తీసుకెళ్లాడు. ఆ సినిమా వాళ్లు నన్ను చూడగానే సెలెక్ట్ చేశారు. అలా మలయాళంలో అప్పటి స్టార్ హీరోయిన్ జయభారతికి చెల్లెలిగా నా సినీరంగ ప్రవేశం జరిగింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News