అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు

  • అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయాను
  • మా ఇంటికి దూరంగా వుండే అలవాటు లేదు
  •  నా వలన మా వాళ్లు ఇబ్బందులు పడ్డారు       
సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా చేసిన 'కొబ్బరి మట్ట' తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో తను 'బిగ్ బాస్' సీజన్ వన్ లో పాల్గొన్నప్పటి సంగతులను గురించి ప్రస్తావించాడు. "అసలు నాకు 'బిగ్ బాస్' కార్యక్రమంపై అంతకు ముందు ఎలాంటి అవగాహన లేదు. అయినా నాకు ఇష్టం లేదనే చెప్పాను. వాళ్లు బాగా వత్తిడి చేయడంతో కాదనలేకపోయాను.

నేను ఊహించినట్టుగానే అక్కడ ఉండలేకపోయాను. ఎందుకంటే మా ఇంటికి .. ఊరుకి నేను దూరంగా ఉండలేను. నా గోల భరించలేక వాళ్లు బయటికి పంపించి వేశారు. ఇంటికి వచ్చిన తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడిని కాదు. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించను" అని చెప్పుకొచ్చాడు.
Sampoornesh Babu

More Telugu News