Karnataka: కర్ణాటక వరదలపై ప్రధానికి లేఖ రాసిన దేవెగౌడ

  • కర్ణాటకలో ఎడతెరిపి లేని వర్షాలు
  • కర్ణాటకలో ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి
  • తాత్కాలిక సాయం కింద రూ.5 వేల కోట్లు విడుదల చేయాలి

కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో వరదల పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీకి జేడీఎస్ అధినేత దేవెగౌడ ఓ లేఖ రాశారు.

కర్ణాటకలో ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని, సహజ విపత్తుగా గుర్తించి తాత్కాలిక సహాయం కింద రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. కాగా, వరదల కారణంగా కర్ణాటకలోని బెళగావి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కర్ణాటక రాష్ట్ర ప్రక‌ృతి వైపరీత్యాల పర్యవేక్షణా కేంద్రం తాజాగా హెచ్చరించడం గమనార్హం.

More Telugu News