mumbai: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.500 కడితే అమెరికా, కెనడాకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం!

  • ప్రకటించిన సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ
  • సెటప్ బాక్స్ తో వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సౌకర్యం
  • ముంబైలో రిలయన్స్ 42వ ఏజీఎం

రిలయన్స్ జియో సంస్థ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం సెటప్ బాక్స్ సాయంతో వీడియో కాల్స్ చేసుకునేలా, కాన్ఫరెన్స్ నిర్వహించేలా జియో వీడియో కాల్స్ ను అభివృద్ధి చేసింది. రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాష్, కుమార్తె ఇషా ఈ  ఫీచర్ ను ముంబైలో ఈరోజు జరుగుతున్న రిలయన్స్ 42వ ఏజీఎంలో మాట్లాడారు. ఈ సెటప్ బాక్సుతో సినిమాలు చూడటంతో పాటు వీడియో కాల్స్, వాయిస్ సెర్చ్, మ్యూజిక్, తదితర సేవలు పొందవచ్చని ఇషా, ఆకాష్ తెలిపారు.

ఇక జియో గిగా ఫైబర్ సాయంతో గేమ్స్ ఆడవచ్చనీ, వేరే రాష్ట్రం, దేశంలో ఉన్న మీ స్నేహితులతో కలిసి మల్టీ ప్లేయర్ గేమ్ లో పాల్గొనవచ్చని వెల్లడించారు. షాపింగ్, గేమింగ్, వినోదం కోసం మిక్స్ డ్ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్ రియాలిటీ సేవలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం హాలోబోర్డును రూపొందించామనీ, త్వరలోనే దీన్ని అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొస్తామని చెప్పారు. అనంతరం ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ.700 నుంచి రూ.10,000 రేంజ్ లో తీసుకొస్తున్నామని తెలిపారు. నెలకు రూ.500 చెల్లించడం ద్వారా అమెరికా, కెనడా దేశాల్లోని తమ బంధువులతో అపరిమితంగా మాట్లాడుకునేలా ‘పే ఫర్ వన్ సర్వీస్’ సేవలను తీసుకొస్తున్నామని వెల్లడించారు.

More Telugu News