Telangana: త్వరలో బీజేపీలో చేరతా: మోత్కుపల్లి

  • అమిత్ షాతో భేటీ తర్వాత పార్టీలో చేరే తేదీ ప్రకటిస్తా
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది
  • బీజేపీయే ప్రత్యామ్నాయం
తెలంగాణ టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని మోత్కుపల్లి స్పష్టం చేశారు. త్వరలో బీజేపీలో చేరతానని చెప్పారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ తర్వాత పార్టీలో చేరే తేదీ ప్రకటిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీయే ప్రత్యామ్నాయం అని అన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని, 370 ఆర్టికల్ రద్దు తర్వాత బీజేప్ గ్రాఫ్ పెరిగిందని, దేశం కోసం బీజేపీ ఏం చేయడానికైనా సిద్ధమేనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ లోకి తనను కేసీఆర్ ఆహ్వానిస్తారని అనుకున్నాను కానీ, ఆయనకు ‘నాలాంటోడు నచ్చడు’ అని వ్యాఖ్యానించారు.
Telangana
Mothkpalli
Bjp
Amith shah
kcr

More Telugu News