నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కళాతపస్వి కె.విశ్వనాథ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు
మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఫిలింగనర్ లో విశ్వనాథ్ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అయితే, విశ్వనాథ్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఆయన్ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లారన్న వదంతులు వ్యాపించాయి.

ఈ నేపథ్యంలో విశ్వనాథ్ స్పందించారు. ఈ వదంతులను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని, ఓ సినిమాలో పాట నచ్చి తనను కలుస్తానని తనకు కేసీఆర్ ఫోన్ చేశారని అన్నారు. ‘కేసీఆర్ రావడం.. శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టుంది. నా అభిమానిగానే కేసీఆర్ మా ఇంటికి వచ్చారు’ అని చెప్పారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
Director
k.viswanath

More Telugu News