Telangana: ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకోకండి.. యువతకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సలహా!

  • అందరూ ఇంజనీరింగ్, డాక్టర్, సివిల్స్ చేయాలి
  • ప్రస్తుత రాజకీయాలన్నీ కుళ్లు, కుతంత్రాలతో నిండిపోయాయి
  • మహబూబాబాద్ లో మాట్లాడిన టీఆర్ఎస్ నేత

మనలో చాలామంది తమ ఆసక్తిని బట్టి కెరీర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేసుకుంటే మరికొందరు వ్యాపారాల్లో రాణిస్తారు. ఇంకొందరు రాజకీయాల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే తనలా మాత్రం రాజకీయాల్లోకి రావొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ యువతీయువకులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శ్రీవివేకవర్ధిని హైస్కూల్‌లో జరిగిన తీజ్ ఉత్సవాలు, బక్రీద్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ..‘నేను ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి ఎన్నో అసౌకర్యాల మధ్య చదువుకున్నా. ఎమ్మెల్యే అయ్యాక జిల్లాకు మెడికల్ కాలేజీని సాధించాను. విద్యార్థులంతా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలి. నాలా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలన్నీ కుళ్లు, కుతంత్రాలు, మోసంతో నిండిపోయాయి. ఇందులో నెగ్గుకురావడం చాలాకష్టం’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News