Amala: ఇది పూర్తిగా నవతరం సినిమా: మన్మథుడు-2పై అమల స్పందన

  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మథుడు-2
  • విపరీతంగా నవ్వి సీట్లోంచి కిందపడిపోయానన్న అమల
  • సినిమా బాగా నచ్చిందంటూ ట్వీట్

అక్కినేని నాగార్జున నటించిన కొత్త చిత్రం మన్మథుడు-2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నాగ్ అర్ధాంగి అమల స్పందించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వాపుకోలేకపోయానని తెలిపారు. కొన్ని సీన్లు చూసి నవ్వీ నవ్వీ సీట్లోంచి కిందపడిపోయానని వెల్లడించారు. మన్మథుడు-2 ఎంతో నచ్చిందని, ఇది పూర్తిగా నవతరం చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమల ట్వీట్ చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు.

More Telugu News