k.laxman: బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం.. రానున్న అమిత్ షా!

  • సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ 
  • సభకు వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ 
  • వెల్లడించిన తెలంగాణ  రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 17న నిజామాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ గత కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో సభ నిర్వహించాలని నిర్ణయించింది. సభ నిర్వహణ కోసం మహబూబ్‌నగర్, కరీంనగర్‌ పేర్లను కూడా పరిశీలించినా చివరికి నిజామాబాద్‌ను ఎంపిక చేశారు. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
k.laxman
Telangana
BJP
Nizamabad District

More Telugu News