Guntur District: తాడేపల్లిలో రేపు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

  • రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం
  • కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న జగన్
  • హాజరుకానున్న వైసీపీ నేతలు, నాయకులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో రేపు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేతుల మీదుగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, తాడేపల్లి గ్రామంలోని ఓల్డ్ టోల్ గేట్ ఎదురుగా వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించారు. ఇందుకోసం రెండు ఎకరాల స్థలాన్ని గతంలో కొనుగోలు చేశారు.
Guntur District
Tadepally
YSRCP
central Office

More Telugu News