రవితేజ తరువాత ఆ స్థాయిలో దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ: నటుడు ఉత్తేజ్

08-08-2019 Thu 16:37
  • మహేశ్ బాబు మంచి అందగాడు 
  • ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఎన్టీఆర్ 
  • తనని తాను చెక్కుకున్న శిల్పం అల్లు అర్జున్
నటుడిగా .. సినీ రచయితగా ఉత్తేజ్ కి మంచి గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ తరం యువ కథానాయకులకు సంబంధించి తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. "ప్రభాస్ ను చూస్తే హీరో అంటే ఇలా వుండాలనిపిస్తుంది. తనకంటూ ఒక స్టైల్ ను ఏర్పాటు చేసుకున్న అందగాడు మహేశ్ బాబు.

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇక తనకి తాను చెక్కుకున్న ఒక శిల్పంగా అల్లు అర్జున్ అనిపిస్తాడు. తండ్రినే గురువుగా భావించి ఎంతో నేర్చుకుని, రెండు మూడు సినిమాలతోనే లక్ష్యాన్ని చేరుకున్న హీరో చరణ్ అని చెప్పొచ్చు. ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ. రవితేజ తరహాలో తనకంటూ ఒక కొత్త స్టైల్ ను క్రియేట్ చేసుకుని, చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా తెరపైకి దూసుకొచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.