పశ్చిమగోదావరిలో ‘బుల్లెట్’పై దూసుకుపోతున్న నారా లోకేశ్.. వీడియో వైరల్!

- పశ్చిమగోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
- దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నేత
- న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు హామీ
ఈ సందర్భంగా మోకాలు లోతులో వరద నీరు ప్రవహిస్తూ ఉన్నప్పటికీ అందులోనే నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. నష్టపోయిన ప్రజలందరిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతానని స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా, పర్యటనలో భాగంగా నారా లోకేశ్ బుల్లెట్ బైక్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నారా లోకేశ్ బైక్ ను నడుపుకుంటూ ముందుకు వెళుతుండగా, పలువురు మద్దతుదారులు వెంట వచ్చారు.