Andhra Pradesh: ఓ దొంగనో, ఓ రౌడీనో కొట్టినట్టుగా ఒక జూనియర్ డాక్టర్ ను పోలీస్ అధికారి కొడతారా?: నారా లోకేశ్ ఫైర్

  • ప్రభుత్వ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది
  • ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప ఇలాంటివి జరగవు 
  • ఈ నిరంకుశ చర్యలను టీడీపీ ఖండిస్తోంది

అఖిల భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేసే బిల్లుపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా విజయవాడలోని జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన క్రమంలో ఓ జూడాపై పోలీస్ అధికారి చేయిచేసుకోవడంపై వైద్యులు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. నడిరోడ్డు మీద ఓ దొంగనో, ఓ రౌడీనో కొట్టినట్టుగా ఒక జూనియర్ డాక్టర్ ను పోలీసు అధికారి కొట్టారంటే ప్రభుత్వ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ఆందోళనలను కఠినంగా అణచి వేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఉంటేనే తప్ప ఇలాంటివి జరగవని, ఈ నిరంకుశ చర్యలను టీడీపీ ఖండిస్తోందని అన్నారు.

More Telugu News