కృష్ణానదిలోకి భారీగా వరద వస్తోంది... తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కర్ణాటక!

  • కర్ణాటకలో భారీ వర్షాలు
  • 5 లక్షల క్యూసెక్కుల వరదకు చాన్స్
  • సమాచారం ఇచ్చిన కర్ణాటక ఇంజనీర్లు
తమ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణానదికి మరింత వరద వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కర్ణాటక ఇంజనీర్ల నుంచి సమాచారం అందినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొస్తుందని కూడా వారు తెలిపారు. ఇప్పటికే నీటి విడుదలను పెంచామని అన్నారు. ఇదిలావుండగా, జూరాలకు ఎగువన ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద కృష్ణలోకి కలుస్తోంది.
Go Back to Shorts
Karnataka
Krishna River
Flood

More Telugu News