Telangana: నేను చేనేత వస్త్రాలు వాడుతున్నా.. మరి మీరు?: కేటీఆర్

  • జాతీయ చేనేత దినోత్సవం నేడు
  • వినూత్నంగా స్పందించిన కేటీఆర్
  • చేనేత కళాకారుల్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి

జాతీయ చేనేత దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యానిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందిస్తూ.. తాను చేనేత వస్త్రాలనే ధరిస్తున్నానని తెలిపారు. ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కళాకారులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతీఏటా ఆగస్టు 7న నిర్వహిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  2015, ఆగస్టు 7 నుంచి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కోల్ కతా(అప్పటి కలకత్తా) టౌన్ హాల్ లో ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా విదేశీ వస్త్రాలు, వస్తువులను త్యజించి భారతీయులు నేసిన వస్త్రాలు, తయారుచేసిన వస్తువులను వాడాలని నిర్ణయించారు. ఈ ఘటనను పురస్కరించుకుని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  

More Telugu News